గంగవరం (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021 : ఏజెన్సీలోని మెటల్ క్వారీలు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. బుధవారం గంగవరం మండలం జగ్గంపాలెంలో ప్రభుత్వానికి సంబంధించిన క్వారీని పీవో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ దుర్గ మెటల్ క్వారీని కారం బాపనమ్మతో పాటు మొత్తం 12 మంది సభ్యులు ఈ క్వారీని లీజ్ ద్వారా నిర్వహిస్తున్నారని, ఈ లీజ్ కాలం ముగియడంతో తిరిగి మా సంఘానికి ఈ లక్ష్మీ దుర్గ క్వారీ మాకు లీజుకు ఇవ్వాలని బాపనమ్మ పాటు గిరిజనులు పీవోకి వివారించారు. ఐటీడీఏ ద్వారా గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇటువంటి క్వారీలకు క్రషర్, జేసీబీ, ట్రాక్టర్, లారీ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయుటకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ లీజ్ తీసుకున్నవారు వివిధ సైజులలో ఈ క్రషర్ ద్వారా కట్ చేసే విధంగా లీజ్ దారులు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీమన్నారాయణ, ఎంపీడీవో జాన్ మిల్టన్, మైనింగ్ ఏడీ శ్రీనివాస రావు, డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ, ఆర్ఐ. జిలాని, వీఆర్వో సత్యనారాయణ, సర్పంచ్ తుర్రం లీలావతి, ఎంపీటీసీ సభ్యురాలు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







