గంగవరం:5 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరూ పోస్టుకార్డు ఉద్యమంలో పాల్గొనాలని రంపచోడవరం జిల్లా సాధన సమితి కన్వీనర్ బాలు అక్కి సాకో కన్వీనర్ సీతంశెట్టి రత్తి శనివారం పిలుపునిచ్చారు. రంపచోడవరం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గంగవరంలో జిల్లా ఏర్పాటు ఆవశ్యకతపై పోస్ట్ కార్డ్ ఉద్యమంపై యువతకు అవగాహన కల్పించారు. జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరుకు పోస్ట్ కార్డు ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. అరకు కేంద్రంగా జిల్లా ఏర్పాటు అయినట్లయితే రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రంపచోడవరం, చింతూరు డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రం చేరుకోవాల్సి ఉంటుందని దాని కంటే రాష్ట్ర రాజధానికి చేరుకోవడం సులువుగా ఉంటుంది అన్నారు. రంపచోడవరం నియోజకవర్గం నుంచి అరకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం కూడా లేదని అన్నారు. ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు పూర్తి చేసిన తర్వాత ఉద్యమాలు చేస్తే ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. ముందస్తుగానే ప్రజలు తమ అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, ఇందుకోసం రంపచోడవరం జిల్లా సాధన సమితి గ్రామ స్థాయి నుంచి ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేసిందని అన్నారు. జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. ఈకార్యక్రమంలో సమితి సభ్యులు మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, సిద్ధూ,శివ, వెంకటేశ్వర్లు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







