Bhuvaneswari Peetam: గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన భువనేశ్వరి అమ్మవారు

UPDATED 28th SEPTEMBEER 2022 6:00 PM

Bhuvaneswari Peetam: పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : పెద్దాపురం పట్టణంలో వర్జుల వారి వీధిలో వేంచేసిఉన్న భువనేశ్వరీ పీఠంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ శుక్ల పక్ష తదియనాడు గాయత్రిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయం నుంచి అభిషేకాది సహస్రనామ పూజా కార్యక్రమాలు, చండీ పారాయణ, చండీ హోమం, నీరాజన మంత్రపుష్పం, దర్భారు సేవలు తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరీ పీఠాధిపతి చింతా గోపిశర్మ సిద్ధాంతి (Chintha Gopi Sarma Siddhaanthi) భక్తులనుద్దేశించి ప్రసంగించారు. దేవీ నవరాత్రులలో మూడవరోజు చాలా విశేషమైనదని, సకల వేద స్వరూపమైన గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూలశక్తి అని, ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తుందని అన్నారు.

గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయని, మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం దక్కుతుందన్నారు. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుందని, గాయత్రీ మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయని ఆయన అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us