సామర్లకోట: 8 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రైతులు ఎవరికి వారే సబ్సిడీ విత్తనాలను పొంది విత్తన శుద్ధిని సక్రమమైన పద్ధతిలో చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందని ఏడీఏ పద్మశ్రీ అన్నారు. సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో రైతులకు రూ.5 కే కిలో వరి విత్తనాలను సబ్సిడీ ధరలకు అందించే కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తొలకరిలో వరి సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా విత్తన శుద్ధిని చేసుకోవాలన్నారు. కాకినాడ డివిజన్ పరిధిలో అన్ని మండలాలతో పాటు అన్ని గ్రామాల్లో సబ్సిడీ విత్తనాలను అందిస్తున్నట్లు చెప్పారు. ఇంకా రైతులకు వ్యవసాయ పద్ధతులపై ఆమె పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఐ. సత్యనారాయణ,
ఎంఈవో సతీష్, విఏఏ అభినయ గ్రామానికి చెందిన పలువురు రైతులు నాయకులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







