సామర్లకోట,17 జూలై 2020 (రెడ్ బీ న్యూస్): కరోనా కష్టకాలంలో, ప్రజల భాధలు తీర్చవలసిన కేంద్రం వారిని వదిలివేసిందని, భారత ప్రజల ఉమ్మడి ఆస్తుల అయిన రైల్వేలను అమ్మకానికి పెట్టి భారాలు మోపడాన్ని నిరసిస్తూ సీఐటీయూ పిలుపు మేరకు సామర్లకోట రైల్వే స్టేషన్ ఎదుట సామర్లకోట, పెద్దాపురం సీఐటీయూ కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ సామర్లకోట మండల ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్, పెద్దాపురం మండల ఉపాధ్యక్షులు దారపురెడ్డి క్రాంతి కుమార్ మాట్లాడుతూ 150 సం.లుగా అభివృద్ధి చేసుకున్న కోట్లాది రూపాయల విలువైన ప్రజల,కార్మికుల కష్టార్జితాలైన రైల్వేలను, వాటి ఆస్తులను తన విదేశీ, స్వదేశి మిత్రులకు అమ్మటానికి కేంద్రం అతి వేగంగా ఏర్పాట్లు చేస్థోమదని విమర్శించారు. ఉక్కు పరిశ్రమలు, బిఎస్ఎన్ఎల్, ఎల్.ఐ.సి, పోర్టులు, బొగ్గు గనులు, బ్యాంకులు, రక్షణరంగం తదితర ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని గతంలో ఎవరు చేయలేనట్లుగాప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రయివేటు వారికి రైల్వే వ్యవస్థను అప్పగిస్తే ప్రయాణికుల చార్జీలు పెరుగుతాయని, ఇప్పుడు పొందుతున్న టికెట్స్ రాయితీలు, వివిధ సెక్షన్లు ఇస్తున్న టికెట్ రాయితీలు రద్దు అవుతాయని ఆరోపించారు. ఫలితంగా భవిష్యత్ లో రైలు ప్రయాణ చార్జీలు పెరగటం వల్ల ప్రజలకు రైళ్లు ద్వారా ప్రయాణాలు, ప్రయాణికులకు భారంగా ఉంటాయని అందుకే ప్రజలందరూ ఈ రైల్వే ప్రైవేటీకరణను ఆపడానికి కదలాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే రైల్వే ప్రొడక్షన్ యూనిట్స్ ద్వారా మన విదేశీ మారక ద్రవ్యం రూ. 20 వేల కోట్లకు పైగా ఆదా చేస్తున్నారన్నారు. రైల్వే మొత్తంగా సంవత్సరానికి రూ.20 వేల కోట్ల డివిడెండ్ గా భారత ప్రభుత్వానికి చెల్లిస్తుందని, అంతటి ఆదాయాన్ని తెస్తున్న రైల్వేలను ప్రైవేటీకరించకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సామర్లకోట మండల ప్రధాన కార్యదర్శి టి. నాగమణి, పెద్దాపురం అధ్యక్ష, కార్యదర్శులు గడిగట్ల సత్తిబాబు, దాడి బేబి, సీఐటీయూ సీనియర్ నాయకులు కరణం ప్రసాదరావు, నీలపాల సూరిబాబు, నాయకులు బాలం సత్తిబాబు, నాగు, ఎన్. సురేష్, మాణిక్యం, చిట్టిడి శ్రీను, మహేశ్, కరణం శ్రీనివాసరావు పాల్గొన్నారు..
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







