Antharvedi: అంతర్వేది కల్యాణోత్సవాలను విజయవంతం చేయాలి

UPDATED 21 JANUARY 2022 FRIDAY 9:00 AM

అమలాపురం : కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాలు విజయవంతం చేయా లని ఆయా శాఖల అధికారులకు అమలాపురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు సూచించారు. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు జరిగే అం తర్వేది ఉత్సవాలపై గురువారం అమలాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం లో డీఎస్పీ వై.మాధవరెడ్డి, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ విజయ రాజు, వివిధశాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కల్యాణోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టా లన్నారు. ఉత్సవాల సమయంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. పంచా యతీరాజ్‌, వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వ యంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. 60 మంది గజ ఈతగాళ్లు, అవసరమైన బోట్లు, లైఫ్‌జాకెట్లతో మత్స్యశాఖ సిద్ధంగా ఉండాలన్నారు. ఉత్సవాలు జరిగే పది రోజులు మద్యం షాపులు మూసి ఉంచాలని ఎక్సైజ్‌శాఖ అధికారులను ఆదేశించారు. డీఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల సమయంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వి.శాంతామణి, డీఎల్‌పీవో ఆర్‌.విక్టర్‌, డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సీహెచ్‌.పుష్కరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us