సామర్లకోట,28 ఆగస్టు 2020 (రెడ్ బీ న్యూస్):పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట చాళుక్య కుమారరామ భీమేశ్వర సమేత బాల త్రిపుర సుందరి అమ్మవారి
గర్భాలయానికి దాత బోడె రామచంద్ర యాదవ్ ఆర్ధిక సహకారంతో సుమారు రూ. 8 లక్షల విలువైన వెండి మకర తోరణం, వెండి ద్వార
అలంకరణ నిర్వహించి ఆలయ ఈవో పులి నారాయణమూర్తికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులచే వెండి ఆభరణాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 14 కిలోల 803 గ్రాముల వెండిని 10 విభాగాలుగా రూపొందించి గర్భాలయానికి అత్యంత రమణీయంగా అలంకరణ నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో రామచంద్ర యాదవ్ దంపతులు,
నోరి కృష్ణారావు, వేదపండితులు కొంతేటి జోగారావు, శర్మ,
రాంబాబు వెంకన్న, గుమస్తా వీరభద్రరావు, తదితర భక్తులు
పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







