Whatsapp: వాట్సాప్ ఇకపై 2GB ఫైల్స్.. వారికి పండగే.. ఆప్షన్ మీకూ వచ్చిందా?

UPDATED 3rd JUNE 2022 FRIDAY 05:00 PM

Redbeenewsవాట్సాప్ (Whatsapp) ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సదుపాయం వచ్చేసింది. బంధువులు, స్నేహితులతో 2జీబీ వరకు సైజ్ కలిగిన ఫైల్స్ ను పంపుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ వినియోగదారులకు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ ఫీచర్ ను వాట్సాప్ ఇప్పటికే రోల్ ఔట్ చేసింది. కొందరు యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రాగా.. మరికొందరికి త్వరలోనే రానుంది. వాట్సాప్ లో ప్రస్తుతం 100 ఎంబీకి మించిన ఆడియో, వీడియో ఫైల్స్ ను పంచుకునే వీల్లేదు. దీంతో చాలా మంది ఆ ఫైల్స్ ను పంపుకోవడానికి ఇతర మాధ్యమాల మీద ఆధారపడుతున్నారు. దీంతో వినియోగదారుల అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని 2 జీబీ వరకు ఫైళ్లను పంచుకునే సదుపాయం తీసుకొస్తున్నట్లు వాట్సాప్ గతంలో ప్రకటించింది. కొద్దిరోజులుగా ఈ సదుపాయాన్ని పరీక్షించిన వాట్సాప్.. తాజాగా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ లో ఈ సదుపాయం మీకు వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే.. 100 ఎంబీకి మించి 2జీబీ లోపల ఉన్న ఫైల్ ను మీకు నచ్చిన వారితో పంచుకోండి. అయితే, ఫైల్ ఏదైనా డాక్యుమెంట్ రూపంలో అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 100 ఎంబీకి మించి ఫైల్ విజయవంతంగా పంపినట్లయితే మీకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లే. ఒకవేళ ఫెయిల్ అయితే మీరు మరికొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొబైళ్లలో హై రిజల్యూషన్ కలిగిన వీడియోలను, ఫొటోలను పంచుకోవడం యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సదుపాయం ద్వారా ఎక్కువ నిడివి కలిగిన వీడియోలతో పాటు సినిమాలు కూడా నచ్చిన వారికి పంపించుకోవచ్చు. థాంక్స్ టు వాట్సాప్!

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us