గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : మండలంలో నూతన సంవత్సర వేడుకలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. యువత ఉల్లాసంగా ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. మండల స్థాయి అధికారులను సిబ్బంది కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే ధనలక్ష్మి లను ఎంపీడీవో జాన్ మిల్టన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది తహశీల్దార్ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో రెవిన్యూ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ బేబీ రత్నం, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా అభిమానుల మధ్య నిరాడంబరంగా నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో నాయకులు తహశీల్దార్, ఎంపీడీవో ఎంఈవో మల్లేశ్వరరావు, ఎస్ఐ చిన్నబాబు తదితరులు యూటీఎఫ్ క్యాలెండర్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







