భార్యకు ప్రేమతో ‘తాజ్‌ మహల్‌’ గిఫ్ట్‌

భోపాల్ (రెడ్ బీ న్యూస్) ‌: సారీ డియర్‌! షాజహాన్‌లా నీకోసం నేను తాజ్‌ మహల్‌ కట్టించలేను కానీ అంత గొప్ప ప్రేమ నాలో ఉంది. ప్రేమికులు, భార్యా భర్తల మధ్య అప్పుడప్పుడు వినిపించే సరదా సంభాషణలు ఇవే కదూ. కానీ ఇక్కడ మీరు చదవబోయే వ్యక్తి మాత్రం అలా కాదండోయ్‌! తన సతీమణి కోసం నిజంగానే తాజ్ మహల్‌ని కట్టించేశాడు. అబ్బురపరిచే ఈ కట్టడాన్ని చూడాలంటే మాత్రం మనం మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌కి వెళ్లాల్సిందే. ఆ ప్రాంత నివాసి ఆనంద్‌ ప్రకాశ్‌ తన భార్య మంజుషా పై ప్రేమతో ఇదంతా చేశాడు. ప్రపంచవింతల్లో ఒకటి, ప్రేమకు చిహ్నమైన తాజ్‌ మహల్‌నే ఎందుకు కట్టాలనిపించింది? దీని కోసం ఎన్నేళ్లు పట్టింది వంటి ఆసక్తికర విషయాలను ఇలా పంచుకున్నాడు ఆనంద్‌...కొత్తగా ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు తాజ్‌ మహాల్‌లా ఎందుకు కట్టకూడదు అని అనుకున్నా.  విభిన్నంగా ఉంటుంది కదా సరే అని అదే ఆలోచనతో ముందుకెళ్లా. ఇదే ఆమెకు మంచి గిఫ్ట్‌గా అనిపించింది. ఈ తాజ్‌మహాల్‌లో మొత్తం ఏడు గదులు ఉన్నాయి. పెద్ద హాల్‌, కిచిన్‌తో పాటు నాలుగు బెడ్ రూమ్స్‌, లైబ్రరీ, అలాగే ధ్యానం చేసుకునేందుకు మెడిటేషన్ హాల్‌ గది కూడా ఉంది. బయట నుంచి కనిపించే ఇంటీరియర్‌ డిజైన్‌ అంతా రియల్‌ తాజ్‌మహాల్ స్ఫూర్తిగా తీసుకున్నా. ఇది కట్టేందుకు మూడేళ్లు పట్టింది. తాజ్ మహల్‌లానే ఇది కూడా చీకట్లో ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఇంటి లోపల, బయటా లైటింగ్‌ను ఏర్పాటుచేశాం’’ అని వెల్లడించాడు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us