అప్పులతో పాలన పాతాళానికి : ఉండవల్లి

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఎటువైపు తీసుకెళుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. జగన్‌ పాలన చూస్తుంటే రాష్ట్రాన్ని పాతాళానికి నెట్టేసినట్టుందన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకూ రూ.6,22,599 కోట్లు రాష్ట్రం తరఫున బాకీ ఉన్నామన్నారు. జగన్‌ రెండేళ్లలో రూ.3,08,104 కోట్లు అప్పు చేశారన్నారు. ఇవి విద్యుత్తు శాఖకు రూ.25 వేల కోట్ల బకాయిలు, గుత్తేదారులకు రూ.75 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. కొత్తగా అసెంబ్లీలో 180 శాతం ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా అప్పు తీసుకొచ్చేలా చట్టం చేశారన్నారు. అప్పులు బారి నుంచి బయటపడే మార్గం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి... అసెంబ్లీని బహిష్కరించడం సరికాదన్నారు. అసెంబ్లీలో హత్యలు, ఆరోపణల కోసం లేవనెత్తడం సరైన విధానం కాదన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us