‘అవసరమైన మేరకు ఆక్సిజన్‌ నిల్వలు’

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : జిల్లాలో అవసరమైన మేర ఆక్సిజన్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సక్రమ సరఫరా.. అనవసర వృథా కాకుండా సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.గౌరీశ్వరరావు కోరారు. కొవిడ్‌ బాఽధితులకు ఆక్సిజన్‌ సరఫరాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం కాకినాడ జీజీహెచ్‌ ఎస్‌పీఎం గ్యాలరీలో అనస్తీసియా విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, డీహెచ్‌, రాజమహేంద్రవరం, జీజీహెచ్‌) వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సులకు శిక్షణ నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ సంక్రాంతి వేళ ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలో మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ నూరుశాతం విజయవంతంగా పంపిణీ చేశామన్నా రు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.వెంకటబుద్ధ, డీసీహెచ్‌ఎస్‌ డా క్టర్‌ రమే్‌షకిషోర్‌, పీఓడీటీటీ డాక్టర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి..

థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో తగిన ముందస్తు కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ సేవలందించాలని జీజీహెచ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ యు. సుధీర్‌ కోరారు. జీజీహెచ్‌లో శానిటేషన్‌ కాంట్రాక్టర్‌ జి.రాంబాబు ఆధ్వర్యంలో శానిటేషన్‌ సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయన్నారు. కొవిడ్‌ వార్డులో పనిచేసే శానిటేషన్‌ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us