విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండాలని మండల విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు సూచించారు. మండలంలోని కొత్తాడలో కస్తూర్భా బాలికల విద్యాలయం, చిన్నగార్లపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. కస్తూర్భా పాఠశాలలో విద్యార్థులు హాజరు తక్కువ ఉండడాన్ని గమనించిన ఆయన నూరు శాతం హాజరు ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే వసతి గృహంలో స్టోర్ రూమ్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిణి పద్మావతి, సీఆర్పీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us