సూర్య దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : సూర్య దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు, వైస్ ఛైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మీ, సుబ్రహ్మణేశ్వరరావు బుధవారం ఆవిష్కరించారు.. స్థానిక గోలివారి వీధిలో ఉన్న వైస్ ఛైర్మన్ స్వగృహంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.. అనంతరం వారు మాట్లాడుతూ సూర్య దినపత్రిక మరింతగా ప్రజల మన్ననలు పొందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. పత్రికా విలువలను మరింత ఇనుమడింపచేసేలా సూర్య పత్రిక కొనసాగడం అభినందనీయమని అన్నారు.. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గవరసాన సూరిబాబు, ఎంపీపీ పెంకే సత్యవతి, ఫర్ ది పీపుల్ ఫౌండేషన్ ఛైర్మన్ గుణ్ణం లక్ష్మణరావు, సూర్య బ్రాంచ్ మేనేజర్ కలిదిండి రామకృష్ణ, సూర్య పెద్దాపురం డివిజన్ ఇంచార్జ్, పెద్దాపురం ప్రెస్ క్లబ్ ( ప్రింట్ మీడియా) అధ్యక్షుడు పచ్చిపాల ప్రసాదరావు, పాత్రికేయులు పాశిల ప్రసాద్, మొల్లి సూర్యనారాయణ, బూరాడ శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us