పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయి : హెచ్.యం చిన్నబాబు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 24 నవంబర్ 2021: ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతితో మరిన్ని బాధ్యతలు పెరుగుతాయని కొత్తాడ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నబాబు అన్నారు. పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న లక్ష్మికి రికార్డు అసిస్టెంట్ గా పదోన్నతి లభించడంతో ఆమెను చింతూరు ఐటీడీఏ ప్రాంతంలోని బొడ్డుగూడెం పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ఈసందర్భంగా పదోన్నతిపై వెళ్తున్న లక్ష్మీ దంపతులను బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నబాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బంది లక్ష్మీ దంపతులను పూలమాలలు, దుశ్శాలువతో సత్కరించి ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండలశాఖ అధ్యక్షుడు రఘుబాబు దొర, డిప్యూటీ వార్డెన్ గంగరాజు, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us