విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 24 నవంబర్ 2021: విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని మండల విద్యాశాఖాధికారి వై. మల్లేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని లక్కొండలో గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కోయ ఎయిడెడ్ పాఠశాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఆంగ్లం, తెలుగు, లెక్కల్లో వెనుకబడి ఉండడం గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us