సకాలంలో స్పందిస్తే ప్రాణం కాపాడవచ్చు

కాకినాడ. (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ప్రమాదంలో గానీ.. మరే ఇతర సందర్భాల్లో ఎవరైనా అనారోగ్య సమస్యకు గురైతే వెంటనే స్పందించి ప్రాథమిక వైద్య సేవలందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కాకినాడలోని పోలీసు కన్వెన్షన్‌ హాల్‌లో జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఏఎన్‌ఎస్‌ సిబ్బందికి ప్రథమ చికిత్స, సీపీఆర్‌ విధానంపై అవగాహన సదస్సును ఆదివారం ఆయన ప్రారంభించారు. జీజీహెచ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ సుధీర్‌, పోలీస్‌ యూనిట్‌ వైద్యుడు నూకరాజు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగినపుడు, గుండెనొప్పి, పాముకాటు, పక్షవాతం, విద్యుదాఘాతానికి గురైనప్పుడు బాధితుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు అందించాల్సిన ప్రథమ చికిత్సపై వివరించారు. ఏఎస్పీ కరణం కుమార్‌, డీఎస్పీలు అంబికాప్రసాద్‌, అప్పారావు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us