బోధనాసుపత్రికి 166,కళాశాలకు 21 పోస్టుల మంజూరు

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 19 నవంబర్ 2021: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో కాకినాడ జీజీహెచ్‌, రంగరాయ వైద్య కళాశాలకు కలిపి మొత్తం 187 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 187 పోస్టుల్లో రంగరాయ వైద్య కళాశాలకు 21, జీజీహెచ్‌కు 166 పోస్టులు కేటాయించారు. ఆర్‌ఎంసీలో 2 ప్రొఫెసర్‌ పోస్టులు, 9 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 2 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మొత్తం 13 పోస్టులు రెగ్యులర్‌ విధానంలో భర్తీ కానున్నాయి. మిగిలిన 8 పారామెడికల్‌ పోస్టులతో పాటు జీజీహెచ్‌లో 76 పారామెడికల్‌, 90 నర్సింగ్‌ పోస్టులు ఒప్పంద విధానంలో భర్తీ కానున్నాయి. ఆర్‌ఎంసీలో ఎమర్జెన్సీ మెడిసిన్‌, అడ్మినిస్ట్రేషన్‌కు ఇద్దరు ప్రొఫెసర్లు, ఆర్థో, సైకియాట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, అడ్మినిస్ట్రేషన్‌, కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, యూరాలజీ విభాగాలకు 9 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, రేడియోథెరపీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ కోసం ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించనున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us