UPDATED 13th APRIL 2022 WEDNESDAY 6:00 PM
KAKINADA RDO : కాకినాడ ఆర్‌డీవోగా బి. వెంకటరమణ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. మాజీ రెవిన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న ఆయనను కాకినాడ డివిజన్ ఆర్డీవోగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
కొత్తగా కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత కాకినాడ డివిజన్ తొలి ఆర్‌డీవోగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని, అందరి సహకారం, సమన్వయంతో కాకినాడ డివిజన్‌ను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ చేరేలా పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.