UPDATED 29th JULY 2022 FRIDAY 06:00 AM
Annavaram: కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి శిగలోకి మరో ఆభరణం చేరనుంది. పెద్దాపురం లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు సత్యదేవుడికి వజ్రకిరీటాన్ని చేయించారు. 656.354 గ్రాముల బరువుగల ఈ కిరీటాన్ని వజ్రాలు, కెంపు, పచ్చలతో రూ.కోటిన్నర ఖర్చుతో తయారు చేయించారు. దీనిని శుక్రవారం దేవస్థానం అధికారులకు అందజేయనున్నారు.