వైసీపీ నాయకుల సంబరాలు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 25 నవంబర్ 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం వైసీపీ నాయకులు గంగవరంలో సంబరాలు చేసుకున్నారు. మండల ఇన్చార్జి రఘునాథ్ ఆధ్వర్యంలో వైసిపి నాయకులు గంగవరంలో ర్యాలీ నిర్వహిస్తూ బాణాసంచా కాలుస్తూ ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి, వైసీపీ నాయకులు మహేష్, ఏడుకొండలు, రాంబాబు, ఏసు తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us