UPDATED 22nd JULY 2022 FRIDAY 03:30 PM
Monkeypox: కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో ఉపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ హడలెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
శుక్రవారం కేరళ రాష్ట్రంలో మరో మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి మల్లపురం వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు అధికారులు గుర్తించారు.దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రంలో 35ఏళ్ల వ్యక్తికి ఆ వైరస్ సోకింది. జూలై 6న యూఏఈ నుంచి కేరళ రాష్ట్రంలోని మల్లపురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న క్రమంలో మాన్ జెర్రీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఈనెల 15న ఆ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. పరీక్షల అనంతరం మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని, ఆ వ్యక్తితో సన్నితంగా ఉన్నవారిని, కుటుంబసభ్యుల్ని అబ్జర్వేషన్లో పెట్టినట్లు మంత్రి చెప్పారు.