నేడు ముక్కోటి.. సత్యదేవుడి ఉత్తర ద్వార దర్శనం!

★ ఉదయం 8 నుుంచి 11 గంటల వరకు అవకాశం 

 ★ సర్వాంగ  సుందరంగా ముస్తాబైన ఆలయం

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. అన్ని ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో కళకళలాడుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలననుసరించి రద్దీని నియంత్రించేందుకు ఆయా ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా సత్యదేవుడి ఉత్తరద్వార దర్శనం గురువారం ఉదయం 5 గంటలకు ప్రారంభించి 11 గంటల వరకు మాత్రమే కొనసాగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. వేకువజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దర్శనాలకు అనుమతించనున్నారు. గతేడాది మాదిరిగా మూలవిరాట్‌, ఉత్తరద్వారం మీదుగా ఉత్సవమూర్తుల దర్శనాలు ఏకకాలంలో భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వార మార్గాన్ని సుగందభరిత పుష్పమాలికలతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఈనెల 18వ తేదీ వరకు సెలవుపై వెళ్లిన ఈవో త్రినాథరావు స్థానంలో ఆర్‌జేసీ సురేష్‌బాబు బుధవారం ఇన్‌చార్జి ఈవో బాధ్యతలు స్వీకరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం ఏర్పాట్లపై సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us