కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022 : సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రంపచోడవరం అడిషనల్‌ ఎస్పీ కృష్ణకాంత్ ‌పటేల్‌ హెచ్చరించారు. గురువారం ఆయన మండలంలో కోడిపందేలు, జూదాలు నిర్వహించే అవకాశాలున్న అనుమానిత ప్రదేశాలను పరిశీలించారు. స్వీయ పర్యవేక్షణలో ఆ ప్రదేశాలను ట్రాక్టర్లతో దున్నించి వేశారు. సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అనుమతులు లేవని. జూదాల జోలికి వెళ్లి అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవద్దని ఆయన హితవు పలికారు. స్థలాల యజమానులకు నోటీసులు అందజేసి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. పండుగ సమయంలో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుకోవాలన్నారు. ఆయన వెంట అడ్డతీగల సీఐ వై.రాంబాబు, గంగవరం ఎస్‌ఐ చిన్నిబాబు, ఏఎస్‌ఐ రమణ తదితరులున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us