పలువురు సీఐల బదిలీ

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కాకినాడ ఎస్బీ సీఐ ఎన్‌.రజనీకుమార్‌ను కాకినాడ ఒకటో పట్టణ లా అండ్‌ ఆర్డర్‌కు, ఈ స్థానంలో పనిచేస్తున్న టి.రామ్మోహన్‌రెడ్డిని కాకినాడ పోర్టు స్టేషన్‌ సీఐగా బదిలీ చేశారు. పోర్టు స్టేషన్‌ సీఐ శ్రీనివాసరావును కాకినాడ ఎస్బీఎక్స్‌కు, రావులపాలెం సీఐ వి.కృష్ణను కాకినాడ మూడో పట్టణ లా అండ్‌ ఆర్డర్‌కు నియమించారు. కాకినాడ మూడో పట్టణ లా అండ్‌ ఆర్డర్‌ సీఐ శ్రీరామకోటేశ్వరరావును వీఆర్‌కు పంపారు. కృష్ణాజిల్లా నూజివీడు సర్కిల్‌ సీఐ ఎం.వెంకటరమణను రావులపాలెం, కాకినాడ రూరల్‌ సర్కిల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణను సర్పవరం, తణుకు సీఐ డీఎస్‌ చైత్యన్యకృష్ణను కాకినాడ ట్రాఫిక్‌-2కు, తుని రూరల్‌ సర్కిల్‌ సీఐ కిశోర్‌బాబును ప్రత్తిపాడు సర్కిల్‌కు బదిలీలు చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us