పునరావాస కాలనీని సందర్శించిన అధికారులు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 22నవంబర్ 2021: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మండలంలోని నేలపాడులో నిర్మిస్తున్న పునరావాస కాలనీని సోమవారం మండల స్థాయి అధికారుల బృందం సందర్శించింది. పునరావాస కాలనీలో నిర్మించిన పాఠశాల, అంగనవాడీ, ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను అధికారుల బృందం పరిశీలించింది. నిర్వాసితులు కాలనీలోకి వచ్చే సమయానికి పాఠశాలల నిర్వహణకు అనుకూలంగా ఉన్నది లేనిది పరిశీలించారు. అలాగే పునరావాస కాలనీలో అవసరమైన సదుపాయాలు గురించి వివరాలు సేకరించారు. ఈ పర్యటనలో తహశీల్దార్ శ్రీమన్నారాయణ, మండల విద్యాశాఖ అధికారి వై. మల్లేశ్వరరావు సీడీపీవో నీలవేణి, రెవెన్యూ ఇనస్పెక్టర్ జిలాని తదితరులు ఉన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us