అక్కడ కిలో పచ్చిమిర్చి రూ.710, టమోటా కిలో రూ. 200

రెడ్ బీ న్యూస్ 13 జనవరి 2022: మన దేశానికి అతి సమీపంలో ఉన్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోంది. చైనా నుంచి అప్పు తీసుకున్నందుకు శ్రీలంక ఇప్పుడు నానా తిప్పలు పడుతోంది. అప్పు కట్టటానికి పడే పాట్లు అన్నీ ఇన్నీకావు. ఈ ప్రభావం శ్రీలంకలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగటానికి ఓ కారణంగా మారింది. అడ్డూ ఆపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు అల్లాడి పోతున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై స్పష్టంగా కనబడుతోంది. ఆహార పదార్థాలు కొనాలంటేనే ప్రజలు హడలిపోతున్న పరిస్థితి ఏర్పడింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజల ఇబ్బందులను తగ్గించడానికి ప్రభుత్వమే నిత్యావసరాల ధరలు నిర్ణయిస్తోంది. వ్యాపారులు ఈ ధరలకే విక్రయాలు చేసేందుకు అక్కడి సైన్యం నిఘా పెట్టింది. దీంట్లో భాగంగా కిలో పచ్చిమిర్చి రూ.710, బీన్స్ రూ.320, క్యారెట్ రూ.200, పచ్చి అరటి రూ.120, బెండ రూ.200, టమాట రూ.200కు వ్యాపారులు అమ్ముతున్నారు. దారుణంగా పడిపోతున్న ద్రవ్యోల్బణంతో శ్రీలంకలో ఆహార పదార్థాల ధరలు నెల రోజుల్లోనే 15 శాతం పెరిగిపోయాయి. దేశంలో పలురకాల వస్తువులు అస్సలు అందుబాటులోనే లేకుండాపోయాయి. ఈ ప్రభావం సామాన్య మానవుడిపై తీవ్రంగా కనిపిస్తోంది. ఇక రోజువారీ కూలీల పరిస్థితి..ఆటో డ్రైవర్లు వంటివారి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కడుపునిండా తినటానికి కూడా ఆలోచించుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వంట గ్యాస్ ధర రెండింతలు కావడంతో గృహిణులు కట్టెల పొయ్యిని ఉపయోగిస్తున్నారు. శ్రీలంకలో ఇటువంటి దారుణ పరిస్థితులకి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి తీసుకున్న అప్పు చెల్లించడానికి అక్కడ ప్రభుత్వం పన్నులు బాగా పెంచేసింది. పన్నులు చెల్లించడానికి ప్రజలు వద్ద డబ్బులు లేవు.. పైగా కరనా ధాటికి వ్యాపారాలు కుదేలయ్యాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఎగుమతులు చేయక.. దిగుమతులు బాగా పెరిగిపోవడం కూడా ఈ సంక్షోభానికి ఒక ప్రధాన కారణం. శ్రీలంక చాలా ఎక్కువ వడ్డీకి చైనా నుంచి అప్పు తీసుకుంది. దాన్ని తీర్చటానికి నానా తంటాలు పడుతోంది. ఆ అప్పుల కుప్పలే శ్రీలంకకు పెను భారంగా మారాయి. అలా తీసుకున్న అప్పుకు సంబంధించి శ్రీలంక ఈ ఏడాది చైనాకు 1.5 నుంచి 2 బిలియన్ డాలర్లు తిరిగి కట్టాల్సి ఉంది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us