మెగాస్టార్‌తో స్టెప్పులేయనున్న యాంకర్‌ రష్మి

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 24 నవంబర్ 2021‌: చేతికందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్‌లో నటిగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నటి రష్మి. యాంకర్‌గా బుల్లితెరపై ఫుల్‌ క్రేజ్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ తాజాగా బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సినిమాలో రష్మి ఆడిపాడనున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. ‘భోళాశంకర్‌’. సోదరి సెంటిమెంట్‌తోపాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్‌’ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. ఇందులో రష్మి కూడా నటిస్తుందని అదేరోజు చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘భోళాశంకర్‌’లో మాస్‌ డ్యాన్స్‌ ఉంటే బాగుంటుందని.. అందులోనూ చిరు డ్యాన్స్‌ చేస్తే థియేటర్‌ దద్దరిల్లిపోతుందని చిత్రబృందం భావించిందట. ఈమేరకు సంగీత దర్శకుడితో కలిసి ఓ మాస్‌ సాంగ్‌కి సన్నాహాలు చేస్తోందట. అంతా ఓకే అయితే.. ఆ పాటలో చిరుతో కలిసి రష్మి స్టెప్పులేయనున్నారని సమాచారం. శేఖర్‌ మాస్టర్‌ ఈపాటకు కొరియోగ్రఫీ చేయనున్నారని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే రష్మికి బంపర్‌ ఆఫర్‌ వరించినట్లే. తమిళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళాశంకర్‌’ తెరకెక్కుతోంది. ఇందులో చిరు సోదరిగా కీర్తిసురేశ్‌ నటించనున్నారు. అలాగే ఆయనకు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us