కస్తూరిబా విద్యాలయానికి టీవీ బహుకరణ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : మండలంలోని కొత్తాడ కస్తూరిబా బాలిక విద్యాలయానికి అవేర్ ఫౌండేషన్ చైర్మన్ మాధవన్ టెలివిజన్ ను అందజేశారు. గత నెలలో ఆయన పాఠశాలను సందర్శించడంతో విద్యార్థులు తమకు టీవీ కావాలని అడగడంతో ఆయన ఆదివారం పాఠశాలను సందర్శించి టీవీ అందజేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తమకు కంప్యూటర్ అందజేసినట్లు అయితే ఉపయోగకరంగా ఉంటుందని కోరడంతో సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలో కంప్యూటర్ అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు అందించే కార్యక్రమంలో భాగంగా గతంలో మేము లోవ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలకు కుట్టు మిషన్లు, ఎల్ఈడీ లైట్లు, ఐరన్ బాక్స్ లు అందజేయడం జరిగిందన్నారు. త్వరలో కస్తూరిబా బాలికల విద్యాలయంలో కంప్యూటర్ అందజేసి విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కస్తూరిబా బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని పద్మావతి మాట్లాడుతూ అవేర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల వినోదం కోసం ఇవి అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్లు వరుణ్, వెంకటరెడ్డి, దివ్య, జిల్లా మేనేజర్ ఉదయ శ్రీనివాస్, సిబ్బంది ప్రసన్న, వాణిశ్రీ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us