రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభం: మనోహర్

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని, సీఎం జగన్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో పర్యటించారు. జనసేన వన సంరక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.జగన్‌ మంచి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాడని ప్రజలు ఆదరించారు. కానీ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించని పరిస్థితి నెలకొంది. వైకాపాను తరిమికొట్టే రోజులు వచ్చాయన్నారు. గతంలో తాను ప్రస్తావించినట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే పరిమితం అవుతున్నారన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సినిమా టిక్కెట్లు తదితర వ్యవహారాలపై చర్చ జరుగుతోందే తప్ప, ప్రజా సమస్యలపై చర్చించడం లేదన్నారు.వరద బాధితులు, రైతులను పరామర్శించే తీరిక సీఎంకు లేదన్నారు. జనసైనికులకు అండగా అధినేత పవన్‌ ప్రతి జిల్లాకు న్యాయ విభాగం ఏర్పాటు చేశారన్నారు. జె.కొత్తూరువాసి కొండపల్లి వెంకటేశ్వర్లు ఇటీవల చనిపోగా.. అతడి కుటుంబ సభ్యులకు జనసేనానిసూచన మేరకు రూ.5 లక్షల చెక్కును అందించారు. జగ్గంపేటలో సూర్యచంద్ర ఆధ్వర్యంలో రూ.1.25 లక్షల నిమ్మ మొక్కలు పంచడం శుభపరిణామన్నారు. నాయకులు తమ్మయ్యబాబు, శ్రీనివాస్‌, గురుదత్త, అయిరాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ గ్రామీణం అచ్చంపేటలో రహదారుల దుస్థితి చూసిన మనోహర్‌ శ్రేణులతో కలిసి శ్రమదానం చేసి గుంతలు పూడ్చారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us