దేశం కోసం పనిచేద్దాం: ఆర్‌ఎస్‌ఎస్‌

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ప్రతిఒక్కరూ దేశం కోసం పనిచేయాలని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబరు 26న పాలకొల్లులో జరిగే గోదావరి సంగమం సాంఘిక్‌లో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరంలోని త్యాగరాయ గానసభ ప్రాంగణంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పథ సంచలన్‌ నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హిందూ సంఘటన్‌ ద్వారా సమాజంలోని రుగ్మతలను దూరం చేయాలన్నారు. దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో దాని నుంచి బయటపడేందుకు ప్రతీ పౌరుడు దేశం నాది అనే భావనతో పనిచేయాలన్నారు. తొలుత స్వయం సేవక్‌లు రూట్‌మార్చ్‌ నిర్వహించారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us