పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

* పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా 

UPDATED 27th APRIL 2022 WEDNESDAY 8:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పరీక్షలు సాఫీగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక సాలిపేట నగరపాలక బాలికోన్నత పాఠశాలలో రెండు కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల నిర్వహణను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు మొత్తం 66,680 మంది విద్యార్థులు 358 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు పరీక్ష సమయమని పేర్కొన్నారు. అనంతరం గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్  పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి పరీక్షా  కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి, పిల్లల హాజరు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రభుత్వ పరీక్షల సంయుక్త సంచాలకులు వి. రాజశేఖర్, అర్బన్ తహసీల్దార్ వైహెచ్ సతీష్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us