ఉత్సాహంగా సాగిన రన్ ఫర్ జీసస్

Updated 15th April 2017 Saturday 2:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం శనివారం ఉత్సాహంగా సాగింది. రన్ ఫర్ జీసస్ కో ఆర్డినేటర్ రెవరెండ్ లంక పురుషోత్తం దాస్ , పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహం గా నిర్వహించారు. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్  రాజా సూరిబాబురాజు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో ఉన్న సెయింట్ జాన్స్ లూథరన్ చర్చి నుంచి మున్సిపల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్, దర్గా సెంటర్, వెంకటేశ్వరస్వామి గుడి, మెయిన్ రోడ్ మీదుగా లూథరన్ చర్చి వరకు ఈ రన్ కొనసాగింది. ఈ సందర్భం గా మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కోఆర్డినేటర్ బ్రదర్ డిడి గోల్డ్ స్టోన్, బిషప్ సిబిఐ సుకుమార్ , తలారి విజయ్ కుమార్, నేతుల ఇమ్మాన్యుయేల్ సహాయం, పల్లా చిన్ని, అధిక సంఖ్యలో క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు.    

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us