వరదలు ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ

UPDATED 17th AUGUST 2020 MONDAY 6:00 PM

అమలాపురం (రెడ్ బీ న్యూస్): జిల్లాలో వరదల కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ పేర్కొన్నారు. పి. గన్నవరం నియోజకవర్గం, పి.గన్నవరం మండలం గంటి పెదపూడి, బూరుగులంక, పెదపూడి లంక, అరిగలవారి లంక, ఊడిమూడి లంక ముంపు ప్రాంతాలను మంత్రి  వేణు గోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గరెడ్డి , అమలాపురం నూతన సబ్ కలెక్టర్ కౌషిక్, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు సోమవారం పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో వరద ఉధృతంగా ఉన్నందున అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై వరద సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. వరదల కారణంగా జిల్లాలో ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని వరద ముంపు ప్రాంతాలను పర్యటించి, సహాయక చర్యలు చేపడుతున్నామని, వరదల కారణంగా ఆహార, పశుగ్రాసం కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజన వసతి, వైద్య సహాయం అందించడం జరుగుతోందని మంత్రి తెలిపారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us