ఏపీ ప్రభుత్వం నుంచి మరో షాక్..

అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : ప్రజలకు, ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరుస షాకులిస్తోంది. తాజాగా ఓటీఎస్ సరసన వస్తున్న ఓటీసీని తీసుకువస్తూ మరో షాక్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో నిర్మాణాలకు నాలా పన్ను వసూలుకు నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు సర్వే నిర్వహించారు. వ్యవసాయ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు ఉన్నా.. దానికి నాలా పన్ను వసూలుతోపాటు ఫెనాల్టీ కట్టి క్రమబద్దీకరించుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర భూముల్లోని నిర్మాణాల డేటా సేకరించిన అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్ణీత కాలపరిమితిలో క్రమబద్దీకరించుకోకపోతే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వ్యవసాయ భూముల్లో ఎప్పుడు నిర్మాణం జరిగినా ఓటీసీ వర్తిస్తుందని స్పష్టం చేస్తూ విడుదల చేసిన ఆదేశాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఓటీసీ వసూళ్ల బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ప్రభుత్వ భూ విలువపై 5 శాతం ఫెనాల్టితో నాలా పన్ను వసూలు చేయనున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us