రేపు మధ్యాహ్నం శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియలు

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: కరోనా బారిన పడిన ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్‌ మాస్టర్‌(72) హైదరాబాద్‌ ఏఐజీలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని రేపు ఉదయం హైదరాబాద్‌ పంచవటిలోని స్వగృహానికి తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 2గంటలకు మహాప్రస్థానంలో అత్యక్రియలు నిర్వహించనున్నారు. చనిపోయే ముందు శివశంకర్‌ మాస్టర్‌కు కొవిడ్‌ నెగిటివ్‌గా నిర్ధరణ అయిందని వైద్యులు వెల్లడించారు. ఆయన పెద్ద కుమారుడు విజయ్‌ శివశంకర్‌ ప్రస్తుతం కొవిడ్‌తో పోరాడుతున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us