అభివృద్ధి పనుల్లో రాజీపడే ప్రసక్తే లేదు

UPDATED 27th SEPTEMBER 2018 THURSDAY 7:00 PM

పెద్దాపురం: గ్రామాల అభివృద్ధి పనుల్లో రాజీపడే ప్రసక్తేలేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో రూ. 2 కోట్ల 4 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి చినరాజప్ప గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని, గత నాలుగు సంవత్సరాల్లో పెద్దాపురం నియోజక వర్గంలో అన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, సామాజిక, అంగన్వాడీ, పంచాయతీ భవనాలు నిర్మించామని తెలిపారు. కట్టమూరు గ్రామంలో రూ. 3 కోట్ల 60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని, వీటిలో కొన్ని పనులు ఇప్పటికే పూర్తి చేశామని, మిగిలిన పనులు డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తిచేయడం జరుగుతుందని చెప్పారు. గ్రామంలోని రామాలయానికి రూ.10 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.14 లక్షలతో రెండు అంగన్వాడీ భవనాలను ప్రారంభించి, ఎస్సీ పేటలో రూ. కోటి సబ్ ప్లాన్ నిధులతో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి, అలాగే ఆర్ అండ్ బి రోడ్డు నుంచి నర్లజర్ల బీడు వరకు రూ.90 లక్షలతో పిఆర్అండ్ ఆర్.డి నిధులతో రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. కట్టమూరు గ్రామంలో 200 మందికి కొత్త ఫించన్లు మంజూరు చేయించానని తెలిపారు. ప్రజల సహకారంతో అభివృద్ధి పనుల్లో ముందుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, అన్నవరం ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు సుందరపల్లి శివనాగరాజు, ఎంపిపి గుడాల రమేష్, ఎంపిటిసిలు అడపా గంగాధరం, గుత్తుల సూర్యావతి, గుత్తుల శ్రీనివాస్, టిడిపి మండల కార్యదర్శి జి.వి.వి. వీర్రాజు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు పెట్లు వీరభద్రరావు, పంచాయతీ రాజ్ డిఈ హరినాధరావు, మండల ఇంజనీర్ రామకృష్ణయ్య, మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us