Bheemla Nayak: యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్.. బొమ్మ చూపించేశాడు బాబోయ్!

UPDATED 26th FEBRUARY 2022 SATURDAY 09:10 PM

Bheemla Nayak: యాక్షన్ సీన్స్.. ఇంటెన్స్ ఎమోషన్స్.. బొమ్మ చూపించేశాడు బాబోయ్!.. ఇదీ భీమ్లా నాయక్ సినిమా చూసిన అనంతరం సగటు పవర్ స్టార్ అభిమాని ఎమోషన్. మాస్ దేవుడు కలెక్షన్ల మోత మోగించేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్ బద్దలుకొడుతున్నాడు. రారా భీమ్లా అని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి.. మాంచి యాక్షన్ మీల్స్ తో ట్రీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. హై ఓల్టేజ్ యాక్షన్ తో రిలీజ్ అయిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొడుతోంది.

ధియేటర్లోకి ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్న ఫాన్స్ ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన భీమ్లానాయక్ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో నటించిన కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమ్లానాయక్.. వరల్డ్ వైడ్ మొత్తం సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి రికార్డులు బద్దలుకొట్టే పనిలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ తర్వాత రెండో సినిమా భీమ్లానాయక్ తో కొత్త కలెక్షన్ల రికార్డులు సెట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే ఫాన్స్ కి పిచ్చెక్కించేసిన పవన్ కళ్యాణ్.. సినిమాలో కంప్లీట్ యాక్షన్ తో ఫుల్ బొమ్మ చూపించారు. అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఇంటెన్స్ ఎమోషన్స్ తో పాటు సినిమాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న ఎలివేషన్ సీన్స్ తో భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఆడియన్స్ పల్స్ పట్టుకున్న పవర్ స్టార్.. కంప్లీట్ గా మాస్ ని టార్గెట్ చేసి తీసిన సినిమా భీమ్లానాయక్. సంవత్సరం క్రితం స్టార్టయిన భీమ్లానాయక్.. రిలీజ్ కాస్త లేటయినా.. లేటెస్ట్ గా వచ్చి ఫాన్స్ కి ఫీస్ట్ ఇచ్చింది. మళయాళం అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా తెరకెక్కిన భీమ్లానాయక్.. తెలుగులో కూడా అదే రేంజ్ సక్సెస్ ని అందుకుంది.

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో, సాగర్ చంద్ర ఇంటెన్స్ డైరెక్షన్ స్కిల్స్ తో పవన్ , రానా చేసిన భీమ్లానాయక్ ఫాన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యింది. అసలు ట్రైలర్స్ దగ్గరనుంచి మొన్న జరిగిన రిలీజ్ ఈవెంట్ వరకూ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక థమన్ ఇచ్చిన మ్యూజిక్.. పవన్ సాంగ్స్ లో టాప్ లిస్ట్ లో ఉన్నాయి. రానా తన క్లాస్ టచ్ ఇచ్చిన మాస్ మేకోవర్ ని అద్బుతంగా చూపించారు. ఇలా అన్ని ఎలిమెంట్స్ తో తెరకెక్కిన భీమ్లానాయక్ పవర్ స్టార్ ఏ సినిమాకు లేనంత నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో మెమరబుల్ సక్సెస్ అయ్యింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us