Updated 24 January 2022 Monday 06:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కూడా కొత్త కేసులు 14వేలు దాటాయి. అలాగే ఏడుగురు చనిపోయారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40 వేల 266 మందికి పరీక్షలు నిర్వహించగా 14,502 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా సోకి ఆస్పత్రుల్లో చేరిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఏడుగురు చనిపోయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.