భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

UPDATED 13th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట : వినాయక చవితి సందర్బంగా స్థానిక టాక్సీస్టాండ్, కొత్తూరులో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాల వేడుకల్లో మాజీ ఎంఎల్సీ బొడ్డు భాస్కరరామారావు గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సుభిక్షంగా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గణనాధుని వేడుకున్నట్లు తెలిపారు. దేశమంతటా గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రజలు అత్యంత భక్తి భావంతో వేడుకగా నిర్వహిస్తారని, పండుగల్లో మొదట వినాయక చవితి నిర్వహించి తదుపరి అన్ని పండుగలు జరిపించుకోవడం హిందూ సాంప్రదాయంలో ఒకటని అన్నారు. ప్రజలందరూ భక్తిభావంతో, ఐకమత్యంతో ఈ పండుగ జరుపుకోవాలని అన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us