ప్రభాస్‌ అభిమానుల నిరీక్షణకు తెర.. ‘రాధేశ్యామ్‌’ గీతం వచ్చేసింది

రెడ్ బీ న్యూస్, 15 నవంబర్ 2021: అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ చాలాకాలం తర్వాత నటిస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా మ్యూజిక్‌ అప్‌డేట్‌ గురించి ప్రభాస్‌ అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూశారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మంచి ప్రేమ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాటని కృష్ణకాంత్‌ (తెలుగు వెర్షన్‌) రచించారు. యువన్‌ శంకర్‌ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందించారు. ఈ వినసొంపైన గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. ప్రభాస్‌- పూజాహెగ్డే జోడీ ఆకట్టుకుంటుంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 70ల కాలం నాటి ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రభాస్‌ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us