హోరెత్తిన హోదా గళం

* ప్రత్యేక హోదా కోరుతూ బంద్‌
* బంద్‌ సంపూర్ణం.. ప్రశాంతం 
* పనిచేయని కార్యాలయాలు  
* వైసిపి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌, జనసేన ఆధ్వర్యంలో నిరసనలు
UPDATED 16th APRIL 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని విపక్ష పార్టీల నాయకులు, శ్రేణులు సోమవారం కదం తొక్కారు. ప్రత్యేక హోదా కోరుతూ నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా, సంపూర్ణంగా సాగింది. వేకువజామున నుంచే ఆ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యమగళాన్ని వినిపించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. మోదీ డౌన్‌ డౌన్‌.. అనే నినాదాలు మోతెక్కాయి. ద్విచక్ర వాహన ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో విపక్షాలు చేపట్టన బంద్‌ విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. హోదా హోరు ఎగసిపడింది. కొత్త రాష్ట్రానికి కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని అన్ని గొంతులు ఒక్కటై నినదించాయి. విపక్షాల బంద్‌ ప్రభావం ఉదయం నుంచే కనిపించింది. ఆయా పార్టీల కార్యకర్తలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి రవాణా వ్యవస్థను స్తంభింపజేయడానికి ప్రయత్నాలు చేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోల్లోనే ఆగిపోయాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలన్నీ మూతపడ్డాయి. సినిమా థియేటర్లు ఉదయం, మధ్యాహ్నం ఆటలు నిలిపేశాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు విపక్ష పార్టీల కార్యకర్తలంతా రోడ్లపై తిరుగుతూ తెరిచి ఉన్న దుకాణాలు మూయిస్తూ ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. నియోజకవర్గాల నేతలు పట్టణాలు, గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయా పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామాల్లోనూ బంద్‌ సెగలు అక్కడక్కడా కనిపించాయి. ఈ కార్యక్రమంలో  పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు, ఆవాల లక్ష్మీనారాయణ, నేతల హరిబాబు, మద్దాల శ్రీను సేపేని సురేష్, వర్రె రవి, శెట్టిబత్తుల దుర్గా, సిపిఎం నాయకులు కరణం ప్రసాద్, పెదిరెడ్డి సత్యనారాయణ, ఎలిశెట్టి రామదాసు, కామిరెడ్డి బోడకొండ, పోతుల బాపిరాజు, పిల్లా రఘు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగినీడి భవన్నారాయణ, దువ్వా సత్తిబాబు, జనసేన నాయకులు తుమ్మల రామస్వామి, బాబు సరోజ్ వాసు, ఉదయ్, అధిక సంఖ్యలో ఆయా పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us