కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చెయ్యాలి:ఆర్డీవో వెంకటరమణ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 18 అక్టోబర్ 2021: డివిజన్ పరిధిలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి పి. వెంకటరమణ కోరారు. ఆర్డీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో సోమవారం మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 18,19,20 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సంబంధిత శాఖల సమన్వయంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో సుమారు లక్షా 64 వేల మంది వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు ఉన్నారని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, 50 శాతం 18 సంవత్సరాలు నిండిన మొదటి డోసు వారికి, మిగిలిన 50 శాతం రెండో డోసు వారికి వేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఉన్న వాలంటీర్లకు వారికి కేటాయించిన 50 మంది కుటుంబాల సంబంధించిన కోవిడ్ వ్యాక్సినేషన్ పై సర్వే చేపట్టే విధంగా సంబంధిత ఎంపీడీవోలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ సర్వే ద్వారా ఎంతమంది వ్యాక్సినేషన్ వేయించుకున్న వారు, వేయించుకోని వారు ఏ కారణంతో వ్యాక్సిన్ వేయించుకోలేదో తదితర అంశాలతో ఈ సర్వేను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సర్వే చేపట్టిన తర్వాత దానిని యాప్ లో అప్ లోడ్ చేయించే బాధ్యతను సంబంధిత ఎంపీడీవోలకు అప్పగించినట్లు తెలిపారు. ఈ సర్వే నివేదికను మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ డీ.ఎం.హెచ్.వోకి అందజేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్లు ఆశావర్కర్లు వాలంటీర్లు సమన్వయంతో సర్వే పూర్తి చేసి అందరికీ వ్యాక్సిన్ జరిగేలా కృషి చేయాలని కోరారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us