AP Current Charges : ప్రజల కోరిక మేరకే విద్యుత్ చార్జీలు పెంచాం – ఎనర్జీ సెక్రటరీ శ్రీధర్

UPDATED 31 MARCH 2022 TUESDAY 04:00 PM

AP Current Charges Hike : ఏపీలో విద్యుత్ చార్జీల పెరుగుదల కాక రేపుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలు సైతం షాక్ తిన్నారు. అయితే.. ప్రజల కోరిక మేరకే స్వల్పంగా విద్యుత్ చార్జీలను పెంచడం జరిగిందని ఎనర్జీ సెక్రటరీ శ్రీధర్ వెల్లడిస్తున్నారు. పెరిగిన విద్యుత్ చార్జీల విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో విద్యుత్ వినియోగం చాలా అధికమౌతోందని, బొగ్గు ధరలు పెరగడం.. బొగ్గు ట్రాన్స్ పోర్టు ఖర్చు ఈ కారణంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుందనే కారణం చెప్పారాయన. అందువల్లే చార్జీలను పెంచడం జరిగిందని వివరించారు.

ఈ టారీఫ్ వల్ల డిస్కంలకు వచ్చే అదనపు ఆదాయం రూ. 1400 కోట్లు మాత్రమేనని లెక్కలు చెప్పారు. నెట్ వర్క్, సప్లై కాస్టులు గత ఏడాదితో పోల్చితే 6.99 శాతం పెరిగినట్లు, గత 10 రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతోందని విషయాన్ని గుర్తు చేశారు. ఆ ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఏమి చెబుతామని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నట్లు, ఈ ప్రభుత్వం పీపీఏలు రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలలో పీపీఏల ధరలు ఆయా రాష్ట్ర పరిస్థితులకు సంబంధించినవని, అమరావతి. ఏపీలో రాబోయే రోజుల్లో డిమాండ్ బాగా పెరగనుందని సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ తెలిపారు.

రూ. 11,123 కోట్లు ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు, డిస్కంల ప్రతిపాదనలపై సింగిల్ టెలిస్కోపిక్ విధానంలో స్లాబ్ లు ఇచ్చామన్నారు. పెరిగిన చార్జీలతో డిస్కంలకు రూ. 1400 కోట్లు మాత్రమే ఆదాయమని, ట్రూ అప్ చార్జీల వల్ల రూ. 2100 కోట్లు మాత్రమే వినియోగదారులపై భారం పడనుందన్నారు. 2022 – 23లో రూ. 2100 కోట్లు మాత్రమే ప్రజలపై భారం పడుతుందని వెల్లడించారు. బోగ్గు ధరలు పెరగడం, బొగ్గు రవాణా ఖర్చులు పెరగడంతో చార్జీలు పెంచాల్సి వచ్చిందని ఇదే విషయాన్ని చెప్పారు. ఏడాదికి 14 శాతం ఇన్పుట్ రేటు పెరగడంతో స్వల్పంగా రేట్లు పెంచాల్సి వచ్చినట్లు, యూనిట్ విద్యుత్ కు రూ.6.98 పడుతుందని తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us