గైట్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

UPDATED 21st JUNE 2018 THURSDAY 7:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ( గైట్) ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని గైట్ అటానమస్, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గైట్ అటానమస్ కళాశాల సి.ఎస్.సి, ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సదాశివ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యోగాతో మంచి ఫలితాలు వస్తున్నాయని, మానవ జీవితంలో యోగా ఒక భాగం కావాలని అన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రాణయోగా కేంద్రం ఆర్గనైజర్ కె. రామకృష్ణ పర్యవేక్షణలో దాదాపు ఒక గంట పాటు వివిధ యోగాసనాలను విద్యార్థినీ, విద్యార్థులు వేశారు. యోగాను నిరంతరం సాధన చేయాలని యోగా గురువు రామకృష్ణ అన్నారు. గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాముఖ్య యోగా నిపుణులు అంకిరెడ్డి పర్యవేక్షణలో ధ్యానం, యోగాసనాలు తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర వ్యాయామాల కంటే యోగా భిన్నమైన అభ్యాసమని, యోగాభ్యాసం, ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియలు మానసిక ప్రశాంతతకు, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యా సంస్థల సిఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ లీలావతి, డాక్టర్ ఎస్. మూర్తి, డాక్టర్ ఎస్. శ్రీగౌరీరెడ్డి, సిఎస్ఇ విభాగాధిపతి డాక్టర్ బి. సుజాత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వి. సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us