కొండచిలువను చంపితే నేరం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: కొండచిలువను హతమార్చి ఊరేగింపు నిర్వహించిన వారికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. ఐదు లక్షల జరిమానాను విధించడం జరుగుతుందని సూదికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణాకర్ హెచ్చరించారు. ఈనెల 29న రాత్రి సమయంలో మండలంలోని పాత రామాలయం వద్ద చెరువు సమీపంలో కొండచిలువపై నుంచి గుర్తుతెలియని వాహనం దూసుకుపోవడంతో అది మృతి చెందింది. ఆ కొండచిలువను శనివారం రేంజ్ ఆఫీసర్ కరుణాకర్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది చెరువు సమీపంలో ఖననం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం అంతరించిపోతున్న కొన్ని జాతుల్లో ఉన్న కొండచిలువను చంపడం నేరంగా పరిగణించనున్నట్టు తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us