ఆదిత్యలో ఘనంగా గ్రంథాలయాధికారుల‌ దినోత్సవం

UPDATED 12th AUGUST 2018 SUNDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గ్రంథాలయ అధికారుల దినోత్సవం పురస్కరించుకుని మూడు గ్రంథాలయాల సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గ్రంధాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిత్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు విచ్చేసి డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ సేవలను కొనియాడారు. ప్రధాన గ్రంథాలయాధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంధాలయాలు సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ, పవర్ మెమరీ పోటీలు నిర్వహించి విజేతలకు వైస్ ప్రిన్సిపాల్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ హాస్టల్ విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us