Toll Gate Charges Hiked : వాహనదారులకు మరో షాక్.. టోల్‌గేట్ ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

UPDATED 30th MARCH 2022 WEDNESDAY 04:30 PM

Toll Gate Charges Hiked : పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ ధరలూ పెరిగాయి. నూనెల ధరలు సలసల మరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో భారం పడింది. వాహనదారులకు షాక్ తగిలింది. టోల్ గేట్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై ప్రయాణం మరింత ఖరీదుగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోల్ గేట్ ఛార్జీలు పెరగనున్నాయి. జాతీయ రహదారులపై ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఫీజుల రూపంలో వాహనదారులకు బాదుడు మొదలు కానుంది.

రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫీజులు శుక్రవారం నుంచి పెరగనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి.(Toll Gate Charges Hiked)

◆ కార్లు, జీపులు వంటి వాహనాలపై రూ.5-10 పెంపు.

◆ బస్సులు, లారీలకు రూ.15-25 పెంపు.

◆ భారీ వాహనాలకు రూ.40-50 వరకు టోల్ ఫీజు పెంచనున్నారు.

◆ సింగిల్‌, డబుల్‌ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది.

రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై కలిపి 57 టోల్‌ ప్లాజాలున్నాయి. వీటి మీదుగా వెళ్లే వాహనాల ద్వారా ప్రస్తుతం రోజుకు సగటున రూ.6.6 కోట్ల వరకు టోల్‌ వసూలవుతోంది. అంటే ఏడాదికి రూ.2,409 కోట్ల వరకు వస్తోంది. తాజాగా పెంచుతున్న ఫీజులతో ఇది మరింత పెరగనుంది.(Toll Gate Charges Hiked)

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us