బోయపాటి – బెల్లంకొండ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది

UPDATED 30th JUNE 2017 FRIDAY 3:00 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం జయ జానకి నాయక. ఇటీవల టైటిల్ లోగో విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. బెల్లంకొండ శ్రీను రోడ్డుపై కూర్చొని ఉండగా, రకుల్ బైక్ పై కూర్చొని ఫోటోలకి ఫోజులిచ్చింది. జులై 7న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి  తీసుకురానున్నట్టు తెలుస్తుండగా సినిమాలో శ్రీనివాస్ తో సహా మొత్తం ఆరుగురు హీరోలు, మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఒకప్పటి హీరోలు జగపతిబాబు, శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. వారే కాక ‘సై’ ఫేమ్ శశాంక్ కూడా నటిస్తున్నారు. ఇక హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కాక మరొక హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ చేస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం క్యాథరిన్ థ్రెసా, మరికొన్ని ముఖ్యపాత్రలు కోసం అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్, సితార, ‘భీమవరం బుల్లోడు’ ఫేమ్ ఎస్తర్ నొరోన్హా నటించారని టాక్. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us