మహిళ హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

UPDATED 17th JUNE 2017 SATURDAY 7:00 PM

పెద్దాపురం: ఇటీవల పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం  గ్రామంలో మరిగించిన నూనె పోసి కత్తితో విచక్షణారహితంగా ఒక మహిళను హత్య చేసిన సంఘటన తెలిసిందే. అందుకు సంబంధించిన విషయంపై సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ముద్దాయిని మీడియా ఎదుట హాజరుపరిచారు. వివరాల్లోకి వెళ్తే పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం గ్రామంలో పల్లా సత్యనారాయణమ్మ అనే మహిళ చీటీల సొమ్ముల విషయంపై అదే గ్రామానికి చెందిన కొప్పన వెంకటలక్ష్మి కి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తన చీటీ సొమ్ములు ఇవ్వాలని వెంకట లక్ష్మిని అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో సత్యనారాయణమ్మ ఆమెపై కక్ష పెంచుకుని పథకం ప్రకారం ఈ నెల 13 న తన ఇంటి వద్ద మరిగించిన నూనె పోసి కత్తితో నరికేసింది. దీంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 17 న ఉదయం 11 గంటలకు స్థానిక ఏడీబీ రోడ్డు లో ఆర్.బి కొత్తూరు  జంక్షన్ వద్ద ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు సి ఐ తెలిపారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us